ఎంసీసీ అధ్యక్షుడిగా సంగక్కర

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-02 07:22:00

img
లండన్‌ : మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర మంగళవారం బాధ్యతలను స్వీకరించాడు. ఈ పదవి దక్కించుకున్న తొలి బ్రిటీషేతర వ్యక్తి అతడే కావడం విశేషం. ఏడాది పాటు సంగక్కర ఈ స్థానంలో ఉండనున్నాడు. అధ్యక్ష పదవికి కుమార పేరును ఈ ఏడాది మేలో జరిగిన ఎంసీసీ వార్షిక సాధారణ సమావేశంలో అప్పటి అధ్యక్షుడు వ్రేఫోర్డ్‌ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ‘ప్రతిష్ఠాత్మక ఎంసీసీ అధ్యక్ష స్థానాన్ని పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాదిలో క్రికెట్‌ను మరింత అద్భుతంగా మార్చేందుకు కష్టపడుతా. ఆట గురించి ఎక్కువ మందికి పరిజ్ఞానం పెంచేందుకు స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంసీసీ ఎప్పటి నుంచో చేస్తున్న విశేష కృషి గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సంగక్కర చెప్పాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN