ఎంసీసీ లైఫ్‌ మెంబర్‌గా గ్రేమ్‌ స్మిత్‌

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-24 02:50:00

లండన్‌: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌స్మిత్‌కు అరుదైన గౌరవం దక్కింది. మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)లో స్మిత్‌ జీవితకాల సభ్యునిగా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఎంసీసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేమ్‌ స్మిత్‌ ఎంసీసీ జీవితకాల సభ్యుడిగా ఎన్నికయ్యాడని తెలిపేందుకు సంతోషిస్తున్నాం’ అని అందులో పేర్కొంది. దీనికి బదులుగా ‘ఎంసీసీకి ధన్యవాదాలు. అసమాన గౌరవానికి నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞుడిని. ఇప్పటికే క్రికెట్‌ వల్ల చాలా మధురానుభూతులను పదిల పరుచుకున్నా. భవిష్యత్తులో వాటిని మీ అందరితో పంచుకుంటా’ అని స్మిత్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD