ఏ కెప్టెన్‌ సాహసించని నిర్ణయాలు కోహ్లీవి : గంభీర్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-13 23:35:00

పుణె: జట్టును విజయపథంలో నడిపిస్తున్న భారత కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ఏ కెప్టెన్‌ సాహసించని నిర్ణయాలను కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడని కొనియాడాడు. ఓడిపోతామనే భయం లేకుండా బరిలోకి దిగడమే కోహ్లీ ప్రధాన బలమని పేర్కొన్నాడు. 'ఓటమి గురించి మీరు భయపడితే ఎప్పటికీ విజయం సాధించలేరు. ఓటమిని లెక్కచేయకుండా కోహ్లీ బరిలోకి దిగుతాడు. అదే అతడి బలం. సారథులుగా గంగూలీ, ధోనీ, ద్రవిడ్‌ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కానీ, కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృషించాడు. స్వదేశంలో పాటు విదేశాల్లోనూ విజయ పరంపర కొనసాగిస్తున్నాడు. ఏ కెప్టెన్‌ సాహసం చేయలేని నిర్ణయాలను కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడు. ఇతర కెప్టెన్లంతా అదనపు బ్యాట్స్‌మన్ జట్టులో ఉండాలని కోరుకుంటారు. దీని వల్ల టెస్టును కోల్పోకుండా ఉంటామని వారి ఆలోచన. కానీ, కోహ్లీ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాడు. విదేశాల్లోనూ అదే ప్రణాళికను అనుసరిస్తాడు. ఇలాంటి సాహాసాలు చేయగలిగేది కోహ్లీ మాత్రమే' అని తెలిపాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN