ఐపిఎల్‌లో కొత్త ప్రయోగం

Mana Telangana

Mana Telangana

Author 2019-11-05 02:44:32

img

మరో కొత్త నిబంధనకు శ్రీకారం!

ముంబై : క్రికెట్‌ను మరింత జనరంజకంగా మార్చేందుకు ఇప్పటికే అనేక ప్రయోగాలు చేశారు. తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి నాంది పలకడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) సన్నద్ధమైంది. కాసుల క్రికెట్‌గా పేరు తెచ్చుకున్న అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో పవర్ ప్లేయర్ అనే ప్రయోగాన్ని సిద్ధం చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఒక ఆటగాడ్ని జట్టు అవసరాల్ని బట్టి ఏ దశలోనైనా సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగించే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అదే సమయంలో తుది జట్టును ప్రకటించే ముందు 11 మందికి బదులు 15మందికి పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉంది.

అంటే తుది జట్టులో ఆడేది 11 మందే అయినా, మిగతా నలుగుర్ని సబ్‌స్టిట్యూట్‌లగా ఉపయోగించుకోవచ్చు. దాంతో ఒక ఆటగాడి స్థానంలో మరొక ఆటగాడ్ని దింపడానికి వెసులుబాటు కుదురుతుందనేది బీసీసీఐ భావన. దీనిపై బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ వచ్చే ఐపిఎల్‌లో తుది జట్టును 11 మందితో కాకుండా 15 మందితో కూడిన జట్టును సిద్ధం చేసుకునే దానిపై కసరత్తులు చేస్తున్నాం. ఈ కొత్త ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడితే 15 మందితో జట్టును ప్రకటించుకోవచ్చు. ఒక ప్లేయర్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగొచ్చు.

వికెట్ పడిన సమయమా, చివరి ఓవరా అనేది కాకుండా ఏ సమయంలోనే అతడ్ని జట్టు అవసరాలకు తగ్గుట్టు వినియోగించుకోవచ్చు. ఇది వచ్చే ఏడాది జరుగనున్న ఐపిఎల్ నాటికి సిద్ధం చేయడానికి చూస్తున్నాం. దీన్ని తొలుత దేశవాళీ లీగ్ అయిన ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలనుకుంటున్నాం’ అని ఆ అధికారి తెలిపారు. ఈ విధానం వల్ల మ్యాచ్ స్వరూపం మారిపోయి అభిమానుల్లో మరింత ఆసక్తిని నింపుతుందనేది నమ్మకంతో బిసిసిఐ ఉంది. కాగా మంగళవారం ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD