ఐపిఎల్‌లో మార్పులకు కసరత్తు

Prajasakti

Prajasakti

Author 2019-10-23 05:13:20

img

న్యూఢిల్లీ: రాబోయే ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌లో పలు మార్పులు చోటు చేసుకోతున్నాయి. ప్రస్తుతం 45 రోజులు సాగుతున్న ఈ టీ20 క్రికెట్‌ టోర్నీని రెండు నెలలకు పొడిగించాలని బిసిసిఐ భావిస్తోంది. ఇందుకు కారణం.. ఐపిఎల్‌లో మధ్యాహ్నం మ్యాచ్‌లను కుదించాలని బోర్డు యోచిస్తుండడమే. ఎండల తీవ్రత దృష్ట్యా ఇకపై ఒక్కో జట్టు సీజన్‌లో ఒకటే మధ్యాహ్నం మ్యాచ్‌ ఆడించేందుకు యోచిస్తోంది. దాంతో వారాంతాల్లో జరిగే రెండు మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గించాలని అనుకుంటున్నారు. ఇలా కాని పక్షంలో ప్రతి మ్యాచ్‌ను సాయంత్రం 7.00గం.లకు మాత్రమే జరిపితే ఎలా ఉంటుందనే కోణాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఒక కోణంలో చూస్తే 45 రోజుల షెడ్యూలే ఎక్కువ అనిపిస్తోంది. అటువంటిది రెండు నెలలకు పొడిగిస్తే ఆ లీగ్‌ బోర్‌ కొట్టే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చే ఐపిఎల్‌ సీజన్‌ ఏప్రిల్‌-1వ తేదీ నుంచి ఆరంభం కానుంది. డిసెంబర్‌ 19న ఆటగాళ్ల వేలం జరగనుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD