ఐపీఎల్‌లో పవర్‌ ప్లేయర్‌!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-05 05:06:43

img

  • తుది జట్టులో 15 మంది ఆటగాళ్లు
  • మ్యాచ్‌ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌కు అవకాశం
  • బీసీసీఐ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పటిదాకా సాగిన 12 సీజన్లు కూడా అత్యంత విజయవంతమయ్యాయి. తాజాగా ఈ లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సరికొత్త నిబంధన తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ నుంచి పవర్‌ ప్లేయర్‌ కాన్సె్‌ప్టను తీసుకురావాలని భావిస్తోంది. దీని ప్రకారం వికెట్‌ పడినప్పుడు లేదా ఓవర్‌ ముగిశాక సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిని బరిలోకి దించే వీలుంటుంది. అంటే తుది జట్టులో లేకున్నా కూడా ఓ బ్యాట్స్‌మన్‌ లేదా బౌలర్‌ మ్యాచ్‌ మధ్యలో ఆడేందుకు వీలుంటుంది. ‘ఈ కాన్సె్‌స్టను ఇప్పటికే ఆమోదించారు. అయితే మంగళవారం జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక ఐపీఎల్‌ తుది జట్టులో 11 మంది కాకుండా 15 మంది ఆటగాళ్లుంటారు. వీరి నుంచే సబ్‌స్టిట్యూట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఐపీఎల్‌కన్నా ముందే ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నాం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపారు.

చివరి ఓవర్‌లో రస్సెల్‌ను ఆడిస్తే..

ఈ కొత్త రూల్‌ మ్యాచ్‌ను ఎలా ప్రభావం చేస్తుందో కూడా ఆ అధికారి వివరించాడు. ‘కోల్‌కతాకు చివరి ఓవర్‌లో 20 పరుగులు రావాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఆండ్రీ రస్సెల్‌ వంద శాతం ఫిట్‌గా లేకపోవడంతో డగౌట్‌లో కూర్చున్నాడనుకోండి. ఈ కొత్త కాన్సెప్ట్‌ ప్రకారం నేరుగా అతడు బ్యాట్‌ చేతపట్టి సిక్సర్ల మోతతో మ్యాచ్‌ను గెలిపిస్తే ఆ మజానే వేరు. అలాగే చివరి ఓవర్‌లో ఆరు పరుగులను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు 19వ ఓవర్‌ తర్వాత డగౌట్‌లో ఉన్న బుమ్రాను రప్పించి బంతి చేతికివ్వవచ్చు. అందుకే ఇది మ్యాచ్‌ను మలుపు తిప్పే పద్దతి కానుంది’ అని ఆ అధికారి తెలిపారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD