ఐపీఎల్ ఆరంభ వేడుకలు రద్దు... బీసీసీఐ సంచలన నిర్ణయం..

News18

News18

Author 2019-11-06 23:03:18

img

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఐపీఎల్ ఆరంభ వేడుకలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ధూంధాంగా జరిగే ఈ వేడుకలకు సినీ సెలబ్రిటీలు హాజరవుతారు. బాణాసంచా.. హంమాగా అంతా ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చవుతుంది. అయితే, అదంతా ‘డబ్బుల దండగ’ వ్యవహారం అని బీసీసీఐ భావిస్తోంది. ఇకపై ఐపీఎల్ ఆరంభ వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయించినట్టు సమాచారం.

2019 ఐపీఎల్ 10 సీజన్‌కు సంబంధించిన ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌ను బీసీసీఐ రద్దు చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన బాధితులకు సంతాపంగా వేడుకలను రద్దు చేసి.. ఆ నిధులను నిధులను ప్రభుత్వానికి అందించింది. ఓపెనింగ్ సెరిమనీ కోసం సుమారు రూ.20 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. అందులో రూ.11 కోట్లను భారత ఆర్మీకి, రూ.7 కోట్లు సీఆర్పీఎఫ్‌కు, రూ.1 కోటి చొప్పున నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD