ఐపీఎల్ లో సరికొత్త ప్రయోగం

Teluguglobal

Teluguglobal

Author 2019-11-05 11:58:08

img

  • పవర్ ప్లేయర్ ప్రయోగానికి కౌంట్ డౌన్

ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన ఐపీఎల్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి నిర్వాహక సంఘం సరికొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ఇప్పటి వరకూ పవర్ ప్లే గురించి మాత్రమే అభిమానులకు తెలుసు.

img

అయితే..ఐపీఎల్-13 సీజన్లో పవర్ ప్లేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఐపీఎల్ బోర్డు నిర్ణయించింది. పవర్ ప్లేయర్ ప్రయోగానికి అవసరమైన కసరత్తులు చేస్తోంది.

ఏమిటీ పవర్ ప్లేయర్….

img టీ-20 మ్యాచ్ తుదిజట్టులో 12 మంది ఆటగాళ్లుంటారు. మొదటి 11 మందిలో ఓ బౌలర్ లేదా ఓ బ్యాట్స్ మన్ ను తప్పించి…ఆట ముగిసేక్షణాలు లేదా…డెత్ ఓవర్లలో జస్ ప్రీత్ బుమ్రా , యాండ్రీ రస్సెల్ లాంటి మ్యాచ్ విన్నర్లను పవర్ ప్లేయర్ గా…సబ్ స్టిట్యూట్ గా బరిలోకి దించడమే పవర్ ప్లేయర్ గా చెబుతున్నారు.

తుదిజట్టులో లేకుండా డగౌట్ కే పరిమితమైన సమయంలో…ఆట 20వ ఓవర్లో రస్సెల్ లేదా బుమ్రా లాంటి ఆటగాళ్లను బరిలోకి దించే అవకాశాన్ని కల్పిస్తారు.

img

ఇదే ఆచరణలోకి వస్తే…మ్యాచ్ లు మరింత రసపట్టుగా, సంచలనాలతో…అనూహ్య ఫలితాలతో సాగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆఖరి ఆరుబాల్స్ లో 20 పరుగులు అవసరమైన సమయంలో బుమ్రా లాంటి బౌలర్ లేదా…రస్సెల్ లాంటి వీరబాదుడు బ్యాట్స్ మన్.. సూపర్ ప్లేయర్ రూపంలో ఫీల్డ్ లోకి దిగితే…ఆ మజాయే వేరని ప్రత్యేకంగా చెప్పాలా మరి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD