ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్… రోహిత్ @10

Mana Telangana

Mana Telangana

Author 2019-10-24 00:33:18

img

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. రెండో స్థానంలోనే కోహ్లి
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన రోహిత్ తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. రెండో టెస్టు ముగిసే సమయానికి రోహిత్22వ ర్యాంక్‌లో నిలిచాడు. అయితే మూడో టెస్టులో డబుల్ సెంచరీ సాధించడంతో ఏకంగా 12 స్థానాలు మెరుగు పరుచుకొని పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. రోహిత్ టెస్టు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇదే సమయంలో టెస్టు, వన్డే, ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో చోటు సంపాదించిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజా రోహిత్ వారి సరసన నిలిచాడు. ఇక, సౌతాఫ్రికా సిరీస్‌లో రోహిత్ ఏకంగా 529 పరుగులు సాధించాడు. దీంతో టెస్టుల్లో తన ర్యాంక్‌ను ఎంతో మెరుగు పరుచుకున్నాడు.

ఇక, తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్5లో చోటు సంపాదించడం విశేషం. కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. ఇక, చటేశ్వర్ పుజారా నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్‌లో నిలకడగా రాణించిన స్టార్ ఆటగాడు, భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానె తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి కంటే 11 పాయింట్ల ఆధిక్యంలో స్మిత్ ఉన్నాడు. ఇక, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా రెండో స్థానంలో, విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. భారత స్టార్ జప్‌ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ అండర్సన్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్స్ విభాగంలో జాసన్ హోల్డర్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్‌వన్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. న్యూజిలాండ్ రెండో, ఇంగ్లండ్ మూడో ర్యాంక్‌లో నిలిచాయి.

Rohit Sharma gets 10th rank in ICC Test Rankings

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD