ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌@ 8

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-26 06:25:55

దుబాయ్‌: హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరచుకొని ఎనిమిదిలో నిలిచాడు. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధవన్‌ టాప్‌-10కు చేరువగా వచ్చారు. తాజా జాబితాను ఐసీసీ బుధవారం విడుదల జేసింది. సౌతాఫ్రికాతో రెండో టీ20లో అజేయంగా 72 పరుగులు చేసిన విరాట్‌..ఒక స్థానం ఎగబాకి 11వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ధవన్‌ మూడు ర్యాంకులు మెరుగుపరుచుకొని 13వ స్థానానికి చేరాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ హేల్స్‌తో కలిసి రోహిత్‌ (664 పాయింట్లు) సంయుక్తంగా ఎనిమిదో ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు. బౌలర్ల విభాగంలో వాషింగ్టన్‌ సుందర్‌ ఎనిమిది స్థానాలు ఎగబాకి 50వ ర్యాంక్‌లో నిలిచాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN