ఒక్కో జట్టు.. రెండు ఇన్నింగ్స్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-06 06:41:27

img

టీ20 హల్‌చల్‌కు అటు టెస్టులే కాకుండా వన్డే ఫార్మాట్‌ కూడా క్రమేపీ తమ ప్రాభవాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. ఐపీఎల్‌లాంటి సక్సె్‌సఫుల్‌ లీగ్‌ల రాకతో రోజంతా జరిగే వన్డేలకు అభిమానుల నుంచి రోజురోజుకూ ఆదరణ తగ్గుతోంది. ఈనేపథ్యంలో వీటిని కూడా జనరంజకంగా మార్చేందుకు.. బ్యాట్‌కు, బంతికి సమన్యాయం

చేసేందుకు బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఓ సరికొత్త ప్రతిపాదనతో ముందుకువచ్చాడు.

  • వన్డేలపై సచిన్‌ సరికొత్త ఆలోచన

ముంబై: ఒక్క వన్డే.. 25 ఓవర్లకు ఓ ఇన్నింగ్స్‌.. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ను సరికొత్తగా ఆడించేందుకు సచిన్‌ చేస్తున్న ప్రతిపాదన ఇది. 2009లోనే మాస్టర్‌ బ్లాస్టర్‌ ఈ తరహా ఆలోచన వెల్లడించగా అప్పట్లో ఐసీసీ కూడా ఈ విషయమై చర్చించింది. కానీ అమలు చేయడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు సచిన్‌ మరోసారి దీన్ని వెలుగులోకి తెస్తున్నాడు. ‘ఐసీసీ ముందుగా 50 ఓవర్ల ఫార్మాట్‌పై దృష్టి సారించాలి. నేనింతకు ముందే సూచించినట్టుగా ఓ జట్టును 25 ఓవర్లకోసారి 15 నిమిషాల విశ్రాంతితో రెండు ఇన్నింగ్స్‌ ఆడించాలి. దీంతో మొత్తం రెండు జట్ల మధ్య నాలుగు ఇన్నింగ్స్‌ జరుగుతాయి. ఇప్పుడు టీమ్‌-ఎ, టీమ్‌-బి మధ్య వన్డే జరిగిందనుకుందాం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌-ఎ 25 ఓవర్లు ఆడాక 15 నిమిషాల విరామం అనంతరం-బి జట్టు కూడా 25 ఓవర్లు ఆడుతుంది. ఇప్పుడు మళ్లీ టీమ్‌-ఎ 26వ ఓవర్‌ నుంచి తిరిగి తమ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆ తర్వాత ఛేదన కోసం మిగిలిన 25 ఓవర్లను టీమ్‌-బి ఆడుతుంది. ఒకవేళ టీమ్‌ ఏ తొలి 25 ఓవర్లలోనే వికెట్లన్నీ కోల్పోయి ఆలౌటైతే అప్పుడు విజయం కోసం టీమ్‌ బీ వరుసగా 50 ఓవర్లు (25+25) ఆడుతుంది’ అని సచిన్‌ వివరించాడు.

ఈ విధానం ద్వారా మంచు ప్రభావాన్ని ఎదుర్కోవచ్చని, ప్రతీ జట్టుకు మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవడానికి అవకాశం దక్కుతుందని చెప్పాడు. ఒకవేళ మంచు ప్రభావం ఉన్నట్టయితే రెగ్యులర్‌ ఫార్మాట్‌లో టాస్‌ గెలిచిన జట్టుకే లాభం ఉంటుందని, అది సరైన ఆట అనిపించుకోదన్నాడు. అలాగే 25 ఓవర్ల ఇన్నింగ్స్‌లో తొలి ఐదు ఓవర్లను పవర్‌ప్లేగా ఆడించాలని సచిన్‌ సూచించాడు. ఇక బౌలింగ్‌ జట్టు తమకు అవసరమైనప్పుడు మూడు ఓవర్లు, బ్యాటింగ్‌ జట్టు రెండు ఓవర్ల పవర్‌ప్లే తీసుకోవచ్చని చెప్పాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD