ఒక్క చాన్స్‌ ప్లీజ్‌!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-18 06:03:07

  • మేరీతో తలపడతా..
  • ట్రయల్‌పై క్రీడా మంత్రికి నిఖత్‌ లేఖ

న్యూఢిల్లీ: ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు చివరి ప్రయత్నంగా తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ క్రీడా మంత్రికి లేఖ రాసింది. వచ్చే ఫిబ్రవరిలో ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ పోటీలు చైనాలో జరుగుతాయి. అయితే ఇందులో పాల్గొనే బాక్సర్లను ట్రయల్స్‌ ద్వారా ఎంపిక చేయాల్సి ఉండగా భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీబీఎఫ్‌) మాత్రం.. ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పతకాలు సాధించిన విజేతలకు నేరుగా అవకాశం కల్పించింది. దీంతో మేరీ కోమ్‌ విభాగం (51కేజీ)లోనే ఉన్న నిఖత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ట్రయల్స్‌ ద్వారా అర్హులైన బాక్సర్లనే పోటీలకు పంపాలని కోరుతూ తాజాగా క్రీడా మంత్రి కిరణ్‌ రిజుజుకు లేఖ రాసింది. ‘క్రీడలంటేనే పారదర్శకతకు మరో పేరు. ట్రయల్స్‌ లేకుండానే నన్ను పక్కనబెట్టడం ఏవిధంగానూ సరికాదు. 23 ఒలింపిక్స్‌ స్వర్ణాలు సాధించిన స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ కూడా ట్రయల్స్‌ ద్వారానే తిరిగి దేశం తరఫున పాల్గొన్నాడు. మనం కూడా అలాగే చేయాలి కదా. అందుకే నాకొక చాన్స్‌ ఇప్పించండి. అదే జరగకపోతే నా శిక్షణకు అర్థమేముంది. మేరీకోమ్‌ అయినా మరెవరైనా ట్రయల్స్‌ ద్వారా ఎంపికైతేనే మంచిది’ అంటూ తాను రాసిన లేఖను సోషల్‌ మీడియాలో ఉంచింది.

బింద్రా మద్దతు: మేరీకోమ్‌తో ట్రయల్స్‌ కోసం నిఖత్‌ జరీన్‌ చేస్తున్న పోరాటానికి మాజీ షూటర్‌ అభినవ్‌ బింద్రా మద్దతు పలికాడు. ‘అథ్లెట్‌ జీవితమనేది సాక్ష్యం కోరుకుంటుంది. అది నిన్నటికన్నా మెరుగ్గా ఉండాలి. అంతేకాదు...అది రేపు కూడా అంతకుమించి ప్రదర్శనను కోరుకుంటుంది. అంతేకానీ క్రీడల్లో నిన్నటి ప్రదర్శన ఎందుకూ పనికిరాదు’ అని ట్వీట్‌ చేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN