ఒక్క పాయింటే తేడా..స్మిత్‌కు చేరువలో కోహ్లీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-15 05:55:46

img

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లీ తిరిగి సుదీర్ఘ ఫార్మాట్‌లో నెంబర్‌వన్‌ ర్యాంకుకు అతి చేరువలో నిలిచాడు. ఐసీసీ తాజాగా వెల్లడించిన టెస్టు బ్యాట్‌మెన్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (937) అగ్రస్థానంలో ఉండగా భారత కెప్టెన్‌ కోహ్లీ (936) అతడికంటే కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో రెండో స్థానంలో ఉన్నాడు.

imgఇంతకుముందు తన 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ శతకం కూడా చేయకపోగా.. సఫారీలతో తొలి టెస్టు ముగిశాక 900 పాయింట్ల దిగువకు చేరాడు. అటు స్మిత్‌ యాషె్‌సలో సెంచరీల మోత మోగించడంతో ఇటీవలి జాబితాల్లో కోహ్లీని వెనక్కినెడుతూ 38 పాయింట్ల ఆధిక్యం పొందాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుతో కోహ్లీ తిరిగి నెంబర్‌వన్‌ ర్యాంకుకు చేరే అవకాశం ఉంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ రెండు సెంచరీల సహాయంతో 8 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ ర్యాంకుకు చేరాడు. పుజారా నాలుగు, రహానె 9వ స్థానాల్లో ఉన్నారు.

ఇక బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్‌ అశ్విన్‌ మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకులో ఉండగా, బుమ్రా మూడో ర్యాంకును కాపాడుకున్నాడు. కమిన్స్‌, రబాడ టాప్‌-2లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో జేసన్‌ హోల్డర్‌, జడేజా తొలి రెండు స్థానాల్లో ఉండగా, అశ్విన్‌ ఐదో ర్యాంకుకు చేరాడు.

//////////

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN