ఒత్తిడితో మరో ఇంగ్లీష్ క్రికెటర్ చిత్తు

Teluguglobal

Teluguglobal

Author 2019-09-28 15:54:39

img

  • అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన సారా టేలర్
  • 13 ఏళ్లపాటు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ విమెన్ గా సారా

అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేని క్రికెటర్లు ఎవరంటే…బ్రిటీష్ క్రికెటర్లు అనిమాత్రమే చెప్పాలి.

img

పురుషులు, మహిళలు అన్న తేడాలేకుండా.. విపరీతమైన ఆతృత, అత్యుత్తమంగా రాణించాలన్న తపన, భరించలేని ఒత్తిడికి గురికావడం, వైఫల్యాన్ని, ఓటమిని ఏమాత్రం భరించలేకపోడం..ఇంగ్లండ్ క్రికెటర్లకు దశాబ్దాల తరబడి ఓ ప్రధాన బలహీనతగా, మానసిక వైకల్యంగా ఉంటూ వస్తోంది.

imgగత 13 సంవత్సరాలుగా ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కు వికెట్ కీపర్ బ్యాట్స్ విమెన్ గా అసమాన సేవలు అందిస్తూ వచ్చిన 30 ఏళ్ల సారా టేలర్.. అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు… ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

img

17 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఇంగ్లండ్ జట్టులో సభ్యురాలిగా ఉంటూ వచ్చిన సారా గత 13 సంవత్సరాల కాలంలో ఆడిన 226 మ్యాచ్ ల్లో 6 వేల 533 పరుగులు సాధించింది. ప్రపంచకప్ నెగ్గిన జట్టులో కీలకసభ్యురాలిగా సైతం గుర్తింపు తెచ్చుకొంది.

img

అయితే…ఒత్తిడిని భరించే శక్తి లేకపోడం, ఏదో తెలియని గందరగోళంతో సతమతం కావడం వంటి కారణాలతో క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

ఆరోగ్యమే ప్రధానం- సారా

img

గత 13 సంవత్సరాలుగా తన జీవితంలో ఓ ప్రధానభాగంగా ఉంటూ వచ్చిన క్రికెట్ కంటే తనకు ఆరోగ్యమే ముఖ్యమని సారా ప్రకటించింది.

img

తీవ్ర ఒత్తిడి కారణంగా తన ఆరోగ్యం రానురాను క్షీణించిపోడంతో రిటైర్మెంట్ ప్రకటించక తప్పలేదని..ఇంగ్లండ్ జెర్సీ ధరించి గ్రౌండ్ లో దిగిన ప్రతిసారీ తాను అత్యుత్తమంగా రాణించడానికి కృషి చేశానని గుర్తు చేసుకొంది.

img

ఇంగ్లండ్ జట్టులో సభ్యురాలు కావటం తనకు గర్వకారణమని సారా తన ప్రకటనలో పేర్కొంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN