ఓటమి అంచుల్లో సఫారీలు… రెండో ఇన్నింగ్స్ 22/4
రాంచీ: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో సఫారీలు ఓటమి అంచుల్లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి 22 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డికాక్ ఐదు పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. హమ్జా, బవుమా పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో షమీ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. డూప్లెసిస్ నాలుగు పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఎల్బిడబ్ల్యూ రూపంలో మైదానం వీడాడు. ఇప్పటికి ఇన్నింగ్స్‌తో తేడాతో పాటు 313 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. ఎల్గర్ 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మూడు రోజే ఆట ముగిసేటట్లు కనిపిస్తోంది.
ఇండియా తొలి ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 162 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 22/4