ఓపెనర్లు మయాంక్‌, రోహిత్‌ అరుదైన రికార్డులు

Nava Telangana

Nava Telangana

Author 2019-10-02 16:11:00

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్లు టీమిండియాకు శుభారంభం అందించారు. సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి ఓపెనింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ అద్భుతమైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కొత్త ఆశలు రేపుతున్నాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్పిన్నర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నాడు. భారీ సిక్సర్‌ బాది అర్ధశతకం సాధించాడు. వీరిద్దరూ భారత్‌ తరఫున కొన్ని రికార్డులను బద్దలు కొట్టారు.
సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్‌, గంభీర్‌ 2010లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సఫారీలపై భారత్‌కు ఇదే తొలి 100+ ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం గమనార్హం. మయాంక్‌ అగర్వాల్‌ మరో రికార్డు బద్దలు కొట్టాడు. భారత్‌ తరఫున సొంతగడ్డపై, విదేశాల్లో అరంగేట్రంలో 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు రుసి మోడీ, సురిందర్‌ అమర్‌నాథ్‌, అరుణ్‌ లాల్‌, సౌరవ్‌ గంగూలీ, సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్య ఈ ఘనత సాధించారు. ఇక భారత గడ్డపై వరుసగా ఆరు టెస్టు ఇన్నింగ్సుల్లో 50+ స్కోర్లు చేసిన నాలుగో ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ అవతరించాడు. అంతకు ముందు ఎవర్టన్‌ వీక్స్‌ (1948 నవబర్‌- 1949 ఫిబ్రవరి), రాహుల్‌ ద్రవిడ్‌ (1997 నవంబర్‌ - 1998 మార్చి), ఆండీ ఫ్లవర్‌ (1993 మార్చి - 2000 నవంబర్‌) ఈ ఘనత సాధించారు. 2016 సెప్టెంబర్‌ నుంచి రోహిత్‌ ఈ ఒరవడి సాగిస్తున్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN