ఓపెనర్‌గా ఒక అవకాశం ఇవ్వాలని జట్టుని వేడుకున్నా: సచిన్

mykhel

mykhel

Author 2019-09-26 14:57:32

img

హైదరాబాద్: ఓపెనర్‌గా తనకు ఒక అవకాశం ఇవ్వాలని టీమ్‌ను వేడుకున్నట్లు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. త‌న కెరీర్ మొద‌ట్లో వ‌న్డేల్లో మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు ఎంత కాలం ఎదురుచూడాల్సి వచ్చిందని సచిన్ టెండూల్కర్ తెలిపారు. 1994లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను స‌చిన్ టెండూల్కర్ ఓ వీడియో రూపంలో వెల్ల‌డించారు.

ఈ మేరకు ఆ వీడియోని సచిన్ టెండూల్కర్ త‌న లింకిడిన్ ఖాతాలో పోస్టు చేశారు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోట్ అయిన తర్వాత సచిన్ టెండూల్కర్ మరింత విజృంభించి ఆడాడు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకోవడంతో ఎవరికీ సాధ్యం కానటువంటి సెంచరీలను సాధించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు.

img

వన్డేల్లో 49 సెంచరీలు

ఈ క్రమంలో వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు సాధించాడు. అయితే, ఓపెన‌ర్‌గా బ్యాటింగ్ చేసేందుకు టీమ్ మేనేజ్‌మెంట్‌ను వేడుకున్న‌ట్లు స‌చిన్ ఈ సందర్భంగా తెలిపారు. నిజం చెప్పాలంటే ఒకానొక దశలో టీమ్‌ను ప్రాధేయ‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చారు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

img

న్యూజిలాండ్‌పై తొలిసారి ఓపెనర్‌గా

"1994లో టీమిండియా తరుపున ఓపెనర్‌గా బరిలోకి దిగా. ఆ రోజుల్లో ఓపెన‌ర్లు కేవ‌లం వికెట్ల‌ను ర‌క్షించుకోవాల‌న్న ఉద్దేశంతో ఉండేవారు. కానీ తాను ఓపెన‌ర్‌గా కొంత దూకుడు ప్రదర్శించా. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు వ‌చ్చి.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఎదుర్కోవాల‌న్న ఆకాంక్ష ఉండేది. దాని కోసం త‌న‌కు ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని టీమ్‌ను వేడుకున్న‌ా. ఒక‌వేళ విఫ‌ల‌మైతే, మ‌ళ్లీ మిమ్మ‌ల్ని అడ‌గ‌ను" అని మేనేజ్‌మెంట్‌కు చెప్పానని సచిన్ అన్నారు.

img

49 బంతుల్లో 82 పరుగులు

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌చిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. "కివీస్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 82 పరుగులు చేశా, ఇక ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఓపెనింగ్ చేస్తాన‌ని నేనెప్పుడూ అడ‌గ‌లేదు, మేనేజ్‌మెంట్ న‌న్నే ఓపెనింగ్ చేయాల‌ని కోరింది. ఓడిపోతామ‌న్న భ‌యం ఉండ‌కూడ‌ద‌ు" అని స‌చిన్ హితువు ప‌లికారు.

img

సచిన్ తన మొదటి ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులివే

ఓపెనర్‌గా తన తొలి మ్యాచ్‌లో సచిన్ సాధించిన 82 పరుగులు ఇప్పటికీ వరల్డ్ రికార్డే. ఒక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించి ఇన్ని పరుగులు చేయలేదు. ఇదిలా ఉంటే, సచిన్ తన మొదటి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 82, 63, 40, 63, 73 పరుగులు చేశాడు. కాగా, భారత్ తరుపున మొత్తం 463 వ‌న్డేలు ఆడిన స‌చిన్‌ 18, 426 పరుగులుచేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN