కచ్చితంగా కుట్ర జరిగింది
-బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్
ఢాకా: భారత పర్యటనకు వెళ్లకుండా బంగ్లాదేశ్‌ను అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేశారని, ఆటగాళ్ల సమ్మె కూడా అందులో భాగమేనని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఆరోపించాడు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని బోర్డు హామీ ఇవ్వడంతో బంగ్లా ఆటగాళ్లు ఇటీవలే సమ్మె విరమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై బీసీబీ మాత్రం సీరియస్‌గానే ఉంది. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లా వచ్చే నెలలో భారత్ రానుంది.