కదం తొక్కిన మలాన్

Mana Telangana

Mana Telangana

Author 2019-11-09 02:57:34

నేపియర్: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో ట్వంటీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 22తో సమం చేసింది. డేవిడ్ మలాన్ 103 (నాటౌట్) సెంచరీకి ఇయాన్ మోర్గాన్ (91) విధ్వంసక ఇన్నింగ్స్ తోడు కావడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 241 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో శుభారంభం అందించారు. గుప్టిల్ తన మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు.

ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన గుప్టిల్ మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 27 పరుగులు చేశాడు. మరోవైపు మున్రో మూడు ఫోర్లతో 30 పరుగులు సాధించాడు. కానీ, వీరిద్దరూ ఔటైన తర్వాత న్యూజిలాండ్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. వన్‌నౌడ్‌లో వచ్చిన వికెట్ కీపర్ సిఫర్ట్ (3) నిరాశ పరిచాడు. ఇక, జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ ఆల్‌రౌండర్ గ్రాండోమ్ కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. గ్రాండోమ్ ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక, సీనియర్ ఆటగాడు టైలర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. డారీ మిఛెల్ (2) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. ఇక ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ టిమ్ సౌథి 4 భారీ సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 39 పరుగులు చేశాడు. మిగతావారు విఫలం కావడంతో కివీస్‌కు భారీ ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి బౌలర్లలో మాథ్యూ పార్కిన్సన్ నాలుగు, జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టారు.

డేవిడ్, మోర్గాన్ విధ్వంసం

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. డేవిడ్ మలాన్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మలాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేసిన మలాన్ పరుగుల సునామీ సృష్టించాడు. అతనికి కెప్టెన్ మోర్గాన్ మెరుపులు కూడా తోడు కావడంతో ఇంగ్లండ్ స్కోరు వేగంగా పరిగెత్తింది. ఇటు మలాన్, అటు మోర్గాన్ పోటీ పడి వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. వీరిని అడ్డుకోవడం కివీస్ బౌలర్ల తరం కాలేదు. బంతి ఏదైనా, బౌలర్ ఎవరైనా వీర బాదుడే లక్షంగా వీరి విధ్వంసం సాగింది. వీరిని కట్టడి చేసేందుకు న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్ భారీ షాట్లతో అలరించాడు. కివీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన మోర్గాన్ పరుగుల వరద పారించాడు. చెలరేగి ఆడిన మోర్గాన్ 41 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో 7 ఫోర్లతో 91 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో మలాన్‌తో కలిసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 182 పరుగులు జోడించాడు. మరోవైపు చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన మలాన్ 51 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో 9 ఫోర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 241 పరుగులకు చేరింది.

బెంగాల్ క్రికెట్ సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మ్యాచ్ కోసం టికెట్ల ధరలను కూడా భారీగా తగ్గించారు. అభిమానులను మరింత ఆకర్షించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీస టికెట్ ధరను 50 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు భారత గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డేనైట్ టెస్టు మ్యాచ్ జరుగలేదు. ఈ పరిస్థితుల్లో తొలిసారిగా జరిగే మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కాగా, భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. అంతేగాక దీని కోసం భారత మాజీ కెప్టెన్ల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నాడు.

Dawid Malan hits century as tourists win fourth T20

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN