కశ్మీర్‌ కాదు.. కరాచీలో చూడండి!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-02 04:48:31

  • పాక్‌పై గంభీర్‌ వ్యంగ్యాస్త్రం

న్యూఢిల్లీ: భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ ముందుకు రాని వేళ.. శ్రీలంక అక్కడ ఆడేందుకు అంగీకరించింది. ఇప్పటికే కరాచీలో ఇరుజట్ల మధ్య రెండు వన్డేలు కూడా ముగిశాయి. బుధవారం మూడో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో లంక జట్టుకు భారీస్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. లంక ఆటగాళ్లు బసచేసే హోటల్‌ వెలుపల, మ్యాచ్‌లాడే స్టేడియం చుట్టూ 2000మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఎంతలా అంటే.. 42 వాహనాలతో భారీ కాన్వాయ్‌, మధ్యలో ఓ అంబులెన్స్‌, రోడ్డుకు ఇరువైపులా పోలీసులు.. దేశాధ్యక్షునికి తగ్గనిస్థాయి భద్రతతో లంక ఆటగాళ్లు స్టేడియానికి చేరుకుంటున్నారు. ఆ నగరంలో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇప్పుడిదే వీడియోను పాక్‌ పౌరుడు ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. ప్రస్తుత ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. ఆ వైరల్‌ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘కశ్మీర్‌ సంగతి కాదు.. కరాచీని చూడండి’ అని ఆ వీడియో కింద ట్వీట్‌ చేసి పాక్‌పై వ్యంగ్యాస్త్రం విసిరాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN