కామన్వెల్త్‌ క్రీడలతో సమయం, డబ్బు వృథా!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-26 06:30:59

  • భారత్‌ శాశ్వతంగా వైదొలగాలి
  • ఐవోఏ చీఫ్‌ బాత్రా సంచలన వ్యాఖ్యలు
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అథ్లెట్లు

న్యూఢిల్లీ: కామెన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనడం సమయం, డబ్బు వృథా అని భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా సంచలన వాఖ్యలు చేశారు. బాత్రా వ్యాఖ్యలపై అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. అధికారులు మాత్రం మద్దతుగా మాట్లాడుతున్నారు. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించడంతో ఈ క్రీడలను బాయ్‌కాట్‌ చేయాలని బాత్రా స్టేట్‌మెంట్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కామన్వెల్త్‌ క్రీడల నుంచి భారత్‌ శాశ్వతంగా తప్పుకోవడాన్ని పరిశీలించాలన్నారు. ‘కామన్వెల్త్‌ క్రీడల ప్రమాణాలు గొప్పగా ఏమీ లేవు. ఈ నేపథ్యంతో క్రీడల నుంచి తప్పుకొని అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు భారత అథ్లెట్లు కృషి చేయాల’ని ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాత్రా వ్యాఖ్యానించారు. అయితే, నరీందర్‌ వ్యాఖ్యలు ఏమాత్రం సరికావని స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ అన్నాడు. ‘గుండె పగిలినట్టుగా ఉంది. అథ్లెట్ల కష్టం మొత్తం బూడిదలో పోసినట్టేన’ని విజేందర్‌ వ్యాఖ్యానించాడు. ఆసియా క్రీడల కంటే కామన్వెల్త్‌లోనే పోటీ ఎక్కువుంటుందని డిస్కస్‌ త్రోయర్‌ కృష్ణ పూనియా తెలిపింది. కాగా, బాత్రా చెప్పినదాంట్లో అసత్యమేమీ లేదని ఆర్చరీ సంఘం సెక్రటరీ పరేష్‌ నాథ్‌ అన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN