కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కోచ్‌గా కుంబ్లే

Prajasakti

Prajasakti

Author 2019-10-03 02:29:07

img

ముంబయి : టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ జట్టు యాజమాన్యంతో ప్రస్తుతం తుది విడత చర్చలు అనంతరం కోచ్‌గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పంజాబ్‌ జట్టు యాజమాన్యం త్వరలో నిర్వహించే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో వచ్చే ఏడాది ఐపిఎల్‌లో కోచ్‌గా కుంబ్లే పంజాబ్‌ తరఫున బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గతంలో భారతజట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగిన కుంబ్లే ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN