కింగ్ కోహ్లీ ఖాతాలో మ‌రో రికార్డు

Nava Telangana

Nava Telangana

Author 2019-10-11 15:47:00

హైద‌రాబాద్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మ‌రో రికార్డు చేరింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 40 సెంచ‌రీలు చేసిన భార‌తీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ద‌క్షిణాఫ్రికాతో పుణెలో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 26వ సెంచ‌రీ కావ‌డం విశేషం. అయితే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచ‌రీల సంఖ్య మొత్తం 69కి చేరుకున్న‌ది. ఇండియా పిచ్‌ల‌పై కోహ్లీకి ఇది 12వ టెస్టు సెంచ‌రీ. అయితే కెప్టెన్‌గా కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 40 సెంచ‌రీలు చేశాడు. మొద‌టి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. కెప్టెన్‌గా పాంటింగ్ 41 సెంచ‌రీలు చేశాడు. గ‌త ప‌ది టెస్టు ఇన్నింగ్స్‌ల్లో స్వ‌ల్ప స్కోర్ల‌కే ఔటైన విరాట్ కోహ్లీ.. పుణె పిచ్‌పై మాత్రం చెల‌రేగాడు. డ‌బుల్ సెంచ‌రీ దిశ‌గా కోహ్లీ ఇన్నింగ్స్ వెళ్తోంది. ప్ర‌స్తుతం ఇండియా 128 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 415 ప‌రుగులు చేసింది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN