కివీస్‌తో టీ 20.. ఇంగ్లండ్‌ విజయం

Prajasakti

Prajasakti

Author 2019-11-01 15:36:28

img

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ 20 లో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. క్రైస్ట్‌చర్చ్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 153 రన్స్‌ చేసింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ టేలర్‌ 44 రన్స్‌ చేశాడు. న్యూజిలాండ్‌ విసిరిన లక్ష్యాన్ని మరో 9 బంతులు ఉండగానే ఇంగ్లండ్‌ అందుకుంది. విన్స్‌ కేవలం 38 బంతుల్లో 59 రన్స్‌ చేశాడు. ఓపెనర్‌ బెయిర్‌స్టో 35 రన్స్‌ చేయగా, మోర్గాన్‌ 34 రన్స్‌ చేశాడు. ఇంగ్లండ్‌, కివీస్‌ మధ్య 5 టీ 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD