కుంబ్లే.. ఆ సలహా ఇచ్చినందుకు సారీ: సెహ్వాగ్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-17 17:38:29

img

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన దిగ్గజ క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రోజు (గురువారం) కుంబ్లే పుట్టినరోజు.

ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు కుంబ్లేకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా విషెస్ తెలియజేశాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. `టీమిండియాకు దొరికిన మ్యాచ్ విన్నర్లలో ఒకరు, అదర్శనీయమైన వ్యక్తి. మీ రెండో శతకం చేజారేలా చేసినందుకు నన్ను క్షమించు కుంబ్లే భాయ్. మీరు నిజ జీవితంలో సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాను. మరో 51 మాత్రమే ఉన్నాయి. కమాన్ అనీల్ భాయ్. హ్యాపీ బర్త్‌డే` అంటూ వీరూ ట్వీట్ చేశాడు. ఓ టెస్ట్ మ్యాచ్‌లో వరుస వికెట్లు కోల్పోయిన భారత్‌ను కుంబ్లే ఆదుకున్నాడు. ఇషాంత్‌తో కలిసి సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. 87 పరుగులతో ఆడుతున్న సమయంలో టీ బ్రేక్ కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాడు. అప్పుడు `ఎందుకింత నెమ్మదిగా ఆడుతున్నావు? వేగంగా ఆడు. బౌండరీలు కొట్టు` అని కుంబ్లేకు వీరూ సూచించాడట. దీంతో ఆట మొదలైన తర్వాత తొలి బంతినే బౌండరీకి తరలించబోయి 87 పరుగుల వద్దే కుంబ్లే అవుటైపోయాడట. దీంతో కుంబ్లే రెండో సెంచరీ అందుకోలేకపోయాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD