కొత్త జంట ఫొటోను ట్వీట్ చేసిన ఐసీసీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-07 15:52:28

img

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు క్రికెట్‌ను ఒక ఆటగా చూడరు. దాన్ని వాళ్ల లైఫ్ స్టైల్‌గా భావిస్తారు. మ్యాచ్‌లో ఇష్టమైన జట్టు గెలిస్తే సంబరాలు చేసుకుని, ఓడితే విచారం వ్యక్తం చేసే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అలాంటి అభిమానికి సంబంధించిన ఓ ఫొటోను ఐసీసీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పుడే పెళ్లి చేసుకున్న ఓ జంట టీవీలో క్రికెట్‌ చూస్తూ కూర్చిండిపోయిన ఘటనకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో ఐసీసీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో స్పందించిన పెళ్లి కొడుకు (హసన్ తస్లీం). పెళ్లి చేసుకుని ఇంటికొచ్చేసరికి టీవీలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌ వస్తుందని తెలిపారు. దీంతో మిగిలిన కార్యక్రమాలను పక్కనపెట్టి టీవీలో మ్యాచ్‌ను చూసుకుంటూ కూర్చిండిపోయామని తెలిపారు. ఐసీసీకి ఆ ఫొటోను తానే పంపినట్లు తెలిపిన హసన్ తస్లీం.. తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD