కొత్త ఫార్మాట్‌లో టీ20 ప్రపంచకప్‌

Prajasakti

Prajasakti

Author 2019-11-05 13:26:17

img

* భారత్‌ ప్రత్యర్ధి దక్షిణాఫ్రికా
ప్రజాశక్తి- స్పోర్ట్స్‌ డెస్క్‌):
ఐసిసి టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ పోటీలు పూర్తయ్యాయి. ఫైనల్లో నెదర్లాండ్స్‌ జట్టు 7 వికెట్ల తేడాతో పపువా న్యుగేనియాను ఓడించి టైటిల్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ పోటీల ద్వారా ఫైనల్‌కు చేరిన రెండు జట్లతో పాటు నమీబియా, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఓమన్‌ జట్లు కూడా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు టీ20 ప్రపంచకప్‌ సంగ్రామం ప్రారంభం కానుంది. ఈసారి టైటిల్‌కై మొత్తం 16 జట్లు పోటీ పడనున్నాయి. 8 జట్లు అర్హత మ్యాచ్‌ టోర్నీ ఆడి మెయిన్‌ టోర్నీకి 4 జట్లు క్వాలిఫై అవుతాయి. ఈసారి పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ను కొత్త ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) నిర్వహించనుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న 8 జట్లు అర్హతమ్యాచ్‌లు ఆడకుండా నేరుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇక 9, 10 స్థానాల్లో ఉన్న బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు ఈసారి కొత్త ఫార్మాట్‌ ప్రకారం ఆరు జట్లతో క్వాలిఫై మ్యాచ్‌లు ఆడి ప్రధాన టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంటుంది.

కొత్త ఫార్మాట్‌ ఎలాగంటే...
ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా ప్రధాన టోర్నీకి అర్హత పొందిన 6 జట్లను రెండు గ్రూప్‌లు (ఏ, బి)గా విభజిస్తారు. టీ20 ర్యాంకింగ్స్‌లో 9, 10 స్థానాల్లో ఉన్న బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లను ఒక్కో గ్రూప్‌లో చేరతాయి. అంటే గ్రూప్‌-ఏలో పపువా న్యుగేనియా, ఐర్లాండ్‌, ఒమతోపాటు శ్రీలంక ఉంటుంది. ఇక గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌తోపాటు నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ ఉంటాయి.
సూపర్‌-12 దశలో జట్లను గ్రూప్‌-1, గ్రూప్‌-2లుగా విభజించనున్నారు. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు సూపర్‌-12కు చేరి ప్రధాన టోర్నీకి అర్హతసాధించి టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో టాప్‌-8లో ఉన్న జట్లతో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్‌-ఏలో తొలిస్థానంలోని జట్టు, గ్రూప్‌-బిలోని రెండోస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్‌-1లో చేరతాయి. ఇక గ్రూప్‌-1లో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లు ఉంటాయి. ఇక గ్రూప్‌-బిలో తొలి జట్టు, గ్రూప్‌-ఏలో రెండో జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-2లో చేరతాయి. ఇందులో భారత్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు ఉంటాయి. టోర్నీలో తొలి మ్యాచ్‌ శ్రీలంక-ఐర్లాండ్‌ మధ్య అక్టోబర్‌ 18న మ్యాచ్‌ జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో నవంబర్‌ 15న జరుగుతుంది. సూపర్‌-12 దశలో భారత్‌ ఐదు మ్యాచుల్లో తలపడనుంది.

భారత్‌ తలపడే మ్యాచ్‌లు
అక్టోబర్‌ 24(శని): భారత్‌ × దక్షిణాఫ్రికా (సా|| 4.30 గం||లకు)
అక్టోబర్‌ 29(గురు): భారత్‌ × అర్హత జట్టు (మ|| 1.30 గం||లకు)
నవంబర్‌ 1(ఆది): భారత్‌ × ఇంగ్లండ్‌(మ|| 1.30 గం||లకు)
నవంబర్‌ 5(గురు): భారత్‌ × అర్హత జట్టు (మ|| 2.00 గం||లకు) నవంబర్‌ 8(ఆది): భారత్‌ × ఆఫ్ఘనిస్తాన్‌ (మ|| 1.30 గం||లకు)
నవంబర్‌ 11(బుధ): సెమీఫైనల్‌-1
(మ|| 1.30గం||లకు)
నవంబర్‌ 12(బుధ): సెమీఫైనల్‌-2
(మ|| 2.00గం||లకు)
నవంబర్‌ 15(శని): ఫైనల్‌(మ|| 1.30గం||లకు)

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD