కోహ్లికన్నా వేగంగా మంధాన రికార్డు

Mana Telangana

Mana Telangana

Author 2019-11-08 04:13:14

ఆంటిగ్వా: విండీస్‌తో బుధవారం జరిగిన నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన (74, 63 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్స్‌లు) అర్ధ శతకంతో ఆకట్టుకుంది. దీంతో మంధాన వన్‌డేలలో వేగవంతంగా 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో మహిళా క్రికెటర్‌గా నిలిచింది.ఆమెకన్నా ముందు ఆసీస్ మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్, ప్రస్తుత సారథి మెక్ లానింగ్‌లు 45 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించారు. మరో వైపు పురుషుల క్రికెట్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, భారత క్రికెటర్లలో శిఖర్ ధావన్ (48), విరాట్ కోహ్లి(53), గంగూలి(52), నవ్‌జోత్ సింగ్ సిద్ధూ (52) ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును చేరుకున్నారు.ఈ నేపథ్యంలో మంధాన భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ (ధావన్ మినహా) అందరినీ వెనక్కి నెడుతూ 51 ఇన్నింగ్స్‌లోనే 2 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం.

కాగా గత రాత్రి విండీస్‌తో జరిగిన ఆఖరి(మూడో) వన్‌డే మ్యాచ్‌లో మిథాలీ సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2 1 స్కోరుతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాట్ చేసిన విండీస్ నిర్ణీతఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా విడీస్ జట్టులో స్టిఫానీ టేలర్ (79),స్టాసీ అన్‌కింగ్( 38)రాణించారు. అనంతరం బ్యాట్ చేసిన భారత్ 42.1 ఓవర్లలోనే లక్షాన్ని ఛేదించింది. ఓపెనర్లు మంధాన(74), జెమిమా రోడ్రిగ్స్ (69)లు అద్భుతంగా రాణించి తొలి వికెట్‌కు 141 పరుగుల శుభారంభాన్ని అందించారు. దీంతో మిధాలి జట్టు సునాయాసంగా విజయం సాధించింది. కాలికి గాయం కారణంగా మంధాన తొలి రెండు వన్‌డేలకు దూరమైన విషయం తెలిసిందే.

Smriti Mandhana Leaves Kohli Behind

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD