కోహ్లికి దాదా థాంక్స్

Mana Telangana

Mana Telangana

Author 2019-10-31 03:06:21

img

కోల్‌కతా : డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు అంగీకరించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కృతజ్ఞతలు తెలిపాడు. తమ అభ్యర్థనను మన్నించి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు సమ్మతించడం ఎంతో ఆనందం కలిగించిందన్నాడు. దీనికి టీమిండియా కెప్టెన్‌కు, సహచర క్రికెటర్లకు గంగూలీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇక, ఈ మ్యాచ్‌ను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నాడు. ఎటువంటి ఆటంకం లేకుండా మ్యాచ్‌ను నిర్వహిస్తామని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. నవంబర్ 22 నుంచి ఈడెన్ గార్డెన్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌లో భారత్‌బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను డే నైట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.

భారత గడ్డపై ఓ డే నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా, గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఎంపికైన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతంలో కూడా చాలా జట్లు భారత్‌తో డే నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తి కనబరిచాయి. కానీ, అప్పటి పాలకుల కమిటీకానీ, బిసిసిఐ తాత్కాలిక కార్యవర్గ సభ్యులు కానీ దీనిపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో డే నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. అయితే గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దీని కోసం కసరత్తు ప్రారంభించాడు. తనదైన పద్ధతిలో అందరిని ఒప్పించి డే నైట్ కలను సాకారం చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD