కోహ్లిని మించిన వారు లేరు

Mana Telangana

Mana Telangana

Author 2019-10-15 15:37:04

img

కరాచీ: ప్రపంచ క్రికెట్‌లోనే విరాట్ కోహ్లి అత్యుత్తమ కెప్టెన్ అనడంలో సందేహం లేదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో కోహ్లి జట్టును నడిపిస్తున్న తీరే దీనికి నిదర్శనమన్నాడు. తాను చూసిన అత్యుత్తమ కెప్టన్లలో కోహ్లిని మించిన వారు ఎవరూ లేరన్నాడు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా చివరి వరకు పోరాడే తత్వం కోహ్లి సొంతమన్నాడు. రెండో టెస్టులో అతను ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండి పోతుందన్నాడు. కోహ్లి వంటి క్రికెటర్ దొరకడం భారత్ అదృష్టమన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని, సమకాలీన క్రికెట్‌లో అతనికి సాటి రాగాల క్రికెటర్ ఎవరూ లేరని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో జట్టు సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టినా కోహ్లి దాని ఒత్తిడి జట్టుపై పడకుండా చూశాడన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లి సఫలమయ్యాడన్నాడు. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును వరుసగా రెండు టెస్టుల్లో ఓడించడం ఎంత పెద్ద జట్టుకైనా అంత తేలిక కాదన్నాడు. అయితే కోహ్లి సారథ్యంలో అది టీమిండియా ఆచరణలో చేసి చూపించిందన్నాడు. రానున్న రోజుల్లో కోహ్లి కెప్టెన్‌గా, క్రికెటర్‌గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అక్తర్ జోస్యం చెప్పాడు.

shoaib akhtar Compliments to Virat Kohli

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD