కోహ్లీకి కుంబ్లే మద్దతు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-27 03:32:00

న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్‌లకు ఐదు శాశ్వత కేంద్రాలు(మైదానాలు) ఉండాలన్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయానికి.. స్పిన్ దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే మద్దతు తెలిపాడు. అలాగే 1980, 90 దశకాల్లో లాగా టెస్టు మ్యాచ్‌లను పండుగల సమయంలో నిర్దేశిత స్టేడియాల్లో నిర్వహించాలని బీసీసీఐకు సూచించాడు. టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచే చర్యల్లో ఇదో దారి అనుకుంటున్నా. మ్యాచ్‌లను కొన్ని కేంద్రాలకు పరిమితం చేయడంతో పాటు మ్యాచ్ నిర్వహించే సమయం కూడా చాలా ముఖ్యం. పొంగల్ పండుగ సమయంలో చెన్నైలో గతంలో టెస్టు జరగడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాగే సీజన్ ప్రారంభంలో ఢిల్లీ, బెంగళూరుతో పాటు ముంబైలో టెస్టులు జరగాలి. కోల్‌కతా సైతం సుదీర్ఘ ఫార్మాట్‌కు వేదికగా ఉండాలి అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. తాను కోచ్‌గా ఉన్న సమయంలో ఇండోర్ టెస్టుకు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చిన అంశాన్ని గుర్తు చేశాడు. డే అండ్ నైట్ టెస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, కాకపోతే సగం మ్యాచ్‌కే ఎక్కువ మంది వచ్చే అవకాశముంటుందన్నాడు. మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డే అండ్ నైట్ టెస్టులు నిర్వహించే టైం కూడా చాలా ముఖ్యమని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD