కోహ్లీకి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ..

Ap7am

Ap7am

Author 2019-11-06 00:13:00

  • జట్టును నడిపించడంలో ఇదే స్పూర్తిని కొనసాగించు: సచిన్
  • కోహ్లీ తొలి సెంచరీ వీడియో పోస్ట్ తో విషెస్ తెలిపిన బీసీసీఐ
  • రికార్డుల ఘనతను చాటుతూ ఐసీసీ ట్వీట్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీఈ రోజు తన 31వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. భార్య అనుష్కశర్మతో కలిసి భూటాన్ లో బర్త్ డే జరుపుకున్న కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన జట్టు సహచరులు, మాజీ క్రికెటర్లు, పలు రంగాల ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు విరాట్, పరుగులు చేయడంలో, భారత జట్టును నడిపించడంలో ఇదే స్పూర్తిని కొనసాగించు ఆల్ ద బెస్ట్’ అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కూడా కోహ్లీని పొగుడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20వేల పరుగులు, టెస్టు కెప్టెన్ గా అత్యధిక డబుల్ సెంచరీలు,ఐసీసీ అవార్డులు క్లీన్ స్వీప్ చేసిన క్రికెటర్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ చేసిన తొలి సెంచరీ వీడియోను పోస్టు చేస్తూ.. బీసీసీఐ కోహ్లీకి వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే రోహిత్‌శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్‌శర్మ, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, అజింక్య రహానే, కుల్దీప్ యాదవ్, మయాంక్ అగర్వాల్, మహ్మద్ కైఫ్, బొరియ మజుందార్, సురేశ్ రైనా తదితరులు కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, దేశ, విదేశాలకు చెందిన అభిమానులనుంచి శుభాకాంక్షల వెల్లువ ప్రవాహంవలే సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతోంది.
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD