కోహ్లీలా ఆడటానికి ధైర్యం కావాలి: డుప్లెసిస్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-14 16:05:00

పుణె: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీలా ఆడటానికి ఎంతో మానసిక ధైర్యం కావాలని దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ అన్నాడు. పుణె వేదికగా ఇరు జట్ల మధ్య ఆదివారం పూర్తయిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం డుప్లెసిస్‌ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. 'టీమిండియా కెప్టెన్‌ ఈ మ్యాచ్‌లో అమోఘంగా బ్యాటింగ్‌ చేశాడు. సాధారణంగా అతడు రాగానే పరుగులు తీస్తాడు. కానీ, ఈసారి నెమ్మదిగా ఆరంభించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వికెట్‌కు తగ్గట్టు మొదట్లో నిదానంగా ఆడినా తర్వాత కుదురుకొని ధాటిగా ఆడేందుకు సిద్ధపడ్డాడు. అలా ఆడటానికి ఎంతో మానసిక ధైర్యం కావాలి. అది మీరు చూడొచ్చు. ఇంకా అతడిని దూరం నుంచే మెచ్చుకోవాలి' డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN