కోహ్లీ అండగా నిలిచాడు: దూబే
ముంబయి: పవర్ హిట్టింగ్, దూకుడే తనకి ఇష్టమని బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికైన ముంబయి ఆల్‌రౌండర్ శివమ్ దూబే అన్నాడు. వచ్చే నెలలో జరగనున్న బంగ్లా టీ20 సిరీస్‌కు 26 ఏళ్ల దూబె భారత్ జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. సహజంగానే నాకు హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉంది. దానిపై మరింత సాధన చేసా. బ్యాటింగ్ దూకుడగా చేయాలని, భారత జట్టుకి నేను ప్రాతినిధ్యం వహించాలని మా నాన్న కోరుకున్నారు. పవర్ హిట్టింగ్ అంటే నాకు ఇష్టం. టీమ్ఇండియాలో చోటు సంపాదించడం ఆనందంగా ఉంది. ఎంపిక అవుతానని ముందే ఊహించా. ఎందుకంటే నా ప్రదర్శనపై నాకు నమ్మకం ఉంది. క్రికెట్లో మెరుగవ్వడానికి మరింత సాధన చేస్తా. ఆల్‌రౌండర్‌గా 100శాతం ఏకాగ్రత, ఫిట్నెస్ నాకు అవసరం. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. ఒత్తిడికి లోనైనా, ఏదైనా సమస్య తలెత్తినా కోహ్లీతో పంచుకునేవాడిని. అతడు నా సమస్యను అర్థం చేసుకొని సాయం చేసేవాడు అని దూబే అన్నాడు.
