కోహ్లీ కేవలం మూడంటే మూడే సెకన్లలో అంగీకరించాడు: గంగూలీ

Nava Telangana

Nava Telangana

Author 2019-11-02 23:45:00

ముంబై: బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్టు విషయంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఒప్పించేందుకు తనకు మూడంటే మూడే సెకన్లు పట్టిందని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. వారం రోజుల క్రితం బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ.. మూడేళ్ల క్రితం టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్‌లో పింక్‌బాల్‌ను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు వైఖరిని మార్చడంలో విజయవంతం అయ్యాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లు అడిలైడ్‌లో డే/నైట్ టెస్టు ఆడిన నాలుగేళ్ల తర్వాత, ఈ నెల 22-26 మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-బంగ్లాదేశ్‌లు తొలి డే/నైట్ టెస్టు ఆడనున్నాయి. 'నిజం చెప్పాలంటే అడిలైడ్‌లో డే/నైట్ టెస్టు ఆడేందుకు భారత్ ఎందుకు నిరాకరించిందో నాకు కారణం తెలియదు. అతడి(కోహ్లీ)తో నేను ఓ గంటసేపు మాట్లాడాను. మనం డే/నైట్ టెస్టులు ఆడాల్సిన అవసరం ఉంది, నీ సమాధానం ఏంటో మూడు సెకన్లలో చెప్పమని అడిగాను. వెంటనే అతడు 'సరే, అలాగే ముందుకెళ్దాం' అని చెప్పాడు' అని సెలక్షన్ కమిటీ మీటింగ్ సందర్భంగా కోహ్లీతో జరిగిన సంభాషణ గురించి గంగూలీ వెల్లడించాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN