కోహ్లీ గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు

Dharuvu

Dharuvu

Author 2019-11-05 13:46:55

img

టీమిండియా కెప్టెన్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ ఈరోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కోహ్లీ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాము.
ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు
విరాట్ తన ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు
రోజు వ్యాయామం చేయడమే కాకుండా చుట్టూ ఉన్నవాళ్లకు కూడా సూచిస్తాడు
విరాట్ కు జపనీస్ వంటకాలంటే చాలా ఇష్టం
సుషి అనే వంటకాన్ని ఎక్కువగా తింటాడు
ఇతనికి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం
విరాట్ తన దగ్గర బ్రూనో అనే కుక్కపిల్ల ఉంది

విరాట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను వీధి కుక్కలను దత్తత తీసుకున్నాడు
యువీ,ధోనీ కోహ్లీని ముద్దుగా చీకు అని పిలుస్తారు
విరాట్ ఒకసారి హెయిర్ కటింగ్ చిన్నగా చేసుకున్నప్పుడు కోచ్,జట్టుకు చీకు అనే కార్టూన్ లా కన్పించేసరికి అప్పటి నుండి అలా పిలుస్తున్నారు
ప్రపంచంలోనే అత్యధిక ధనవంత క్రికెటర్లలో కోహ్లీ ఒకరు
కోహ్లీకి కార్లు చాలా ఇష్టం. ప్రముఖ లగ్జరీ కారు సంస్థ ఆడి కి కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు
విరాట్ కు ఇష్టమైన క్రికెటర్ హర్సెల్ గిబ్స్
విరాట్ కు ఉద్వేగం,ఆవేశమెక్కువ
విరాట్ కు చరిత్ర అంటే ఎంత మక్కువో.. గణితం అంటే అంత భయం
2006లో విరాట్ కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతుండగా వాళ్ల తండ్రి చనిపోయాడు
ఆరోజు విరాట్ బాధను దిగమింగి ఆ మ్యాచ్లో తొంబై పరుగులు చేశాడు
విరాట్ కు ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్ కరీష్మా కపూర్

బాలీవుడ్ హీరోయిన్,నిర్మాతైన అనుష్క శర్మను వివాహాం చేసుకున్నాడు
టీమిండియా అండర్ 19 జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు 2008లో అండర్ 19 వరల్డ్ కప్ ను గెలుచుకుంది
2011లో బంగ్లాతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లో ఓపెనర్ గా వెళ్లి సెంచురీ చేశాడు
వరల్డ్ కప్ తొలి మ్యాచ్లోనే సెంచురీ చేసిన తొలి టీమిండియా అటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు
కోహ్లీ తన శరీరానికి నాలుగు టాటూలు వేసుకున్నాడు
ఇందులో గోల్డెన్ డ్రాగన్,సమురాయ్ వారియర్ టాటూలు ఎక్కువగా ఉంటాయి
ఇవి ఉంటే తనకు అదృష్టమని నమ్ముతాడు కోహ్లీ
కోహ్లీ తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ను తమిళనాడుతో 2006లో ఆడుతూ కేవలం పది పరుగులకే ఔటయ్యాడు
విరాట్ కు 2013లో అర్జున అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు

2008లో వన్డే క్రికెట్లోకి అడుగెట్టాడు
2012లో ప్రపంచ వ్యాప్తంగా మంచి వేషధారణ ఉన్న పది మంది పురుషుల్లో విరాట్ ఒకరు ఎంపికయ్యారు
2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఫాసెస్ట్ సెంచురీ చేసిన బ్యాట్స్ మెన్స్ లో ఒకరిగా విరాట్ రికార్డుకెక్కాడు
వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్లో డబుల్ సెంచురీలు చేసిన ఆటగాడిగా రికార్డు
ఇండియన్ సూపర్ లీగ్ లో గోవా పుట్ బాల్ క్లబ్ జట్టుకు,ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్లో యూఏఈ రాయల్స్ జట్టుకు సహా భాగస్వామిగా ఉన్నారు
ప్రారెజ్లింగ్ కు చెందిన జెఎస్ డబ్ల్యూ బెంగుళూరు ఫ్రాంచైజీను సొంతం చేసుకున్నాడు

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN