కోహ్లీ గొప్ప ప్లేయర్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-20 04:59:00

img

-విరాట్‌ను ప్రశంసించిన అఫ్రిది
న్యూఢిల్లీ: టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాపై రెండో మ్యాచ్‌లో అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించిన టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లీ గొప్ప ఆటగాడు. అతడు ఈ విజయాల పరంపరను ఇలాగే కొనసాగిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించాలని కోరుకుంటున్నా అని అఫ్రిది ట్వీట్ చేశాడు. సఫారీలతో బుధవారం జరిగిన పోరులో నాయకుడిగా జట్టును ముందుండి నడిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విరాట్.. పొట్టి ఫార్మాట్‌లో 11 సార్లు ఈ ఘనత సాధించి.. అఫ్రిది (11) సరసన చేరాడు. ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (12) టాప్‌లో ఉన్నాడు. ఈ ప్రదర్శనతో కోహ్లీ టీ20ల్లో అత్యధిక పరుగులు (2441), అర్ధశతకాలు (22) సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. దీంతో పాటు మూడు ఫార్మాట్‌లలోనూ 50కి పైగా సగటు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతేడాది కూడా ఈ ఫీట్ నమోదు చేసిన కోహ్లీని ఐసీసీ ట్విట్టర్ వేదికగా అభినందించింది.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN