కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

Mana Telangana

Mana Telangana

Author 2019-11-05 00:09:27

img

రాంచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సాధించిన ఓ రికార్డును భారత యువ సంచలనం శుభ్‌మన్ గిల్ బద్దలు కొట్టాడు. శుభ్‌మన్ కొత్త రికార్డుతో ప్రకంపనలు సృష్టించాడు. ఈ క్రమంలో కోహ్లి రికార్డును తిరగరాశాడు. దేవధార్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్‌-సి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ద్వారా కొత్త రికార్డును శుభ్‌మన్ తన పేరిట లిఖించుకున్నాడు. దేవధార్ ట్రోఫీ ఫైనల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సారథిగా నిలిచాడు. శుభ్‌మన్ 20 ఏళ్ల 50 రోజుల వయసులో దేవధార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గతంలో విరాట్ కోహ్లి 21 ఏళ్ల 142 రోజుల వయసులో సారథిగా చేశాడు. 2009-10 సీజన్‌లో దేవధార్ ట్రోఫీ ఫైనల్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదే ఇప్పటివరకూ దేవధార్ ట్రోఫీ ఫైనల్ రికార్డు ఉండేది, తాజాగా శుభ్‌మన్ దీన్ని తన పేరిట లిఖించుకున్నాడు.

Shubman gill breaks Virat Kohli record

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD