కోహ్లీ ‘డబుల్’ ధమాకా!

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-12 01:26:22

img

పూణె, అక్టోబర్ 11: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండోరోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. సఫారీ బౌలింగ్‌ను చిత్తుచేసి డబుల్ సెంచరీ సాధించాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 273/3 శుక్రవారం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్, వైస్ కెప్టెన్ల జోడీని విడదీసేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీ ఎలాంటి అవకాశమివ్వలేదు. ఈ క్రమంలో రహానే అర్ధ సెంచరీ సాధించగా, కోహ్లీ సిరీస్‌లో మొదటి శతకం సాధించగా, టెస్టులో 26వ సెంచరీని నమోదు చేశాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన రహానే (59) మహారాజ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. నాలుగో వికెట్‌కు కోహ్లీ, రహానే కలిసి 178 పరుగుల విలువైన రికార్డు భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా వచ్చీ రాగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అప్పటికే 150 పరుగుల మార్కును దాటిన కోహ్లీ మరింత రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి పంపడంతో సఫారీలు చూస్తూ ఉండిపోయారు. ఇదిలాఉంటే కోహ్లీని అవుట్ చేసేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయంది. ఈ దశలో నే విరాట్ తన కెరీర్‌లో 7వ డబుల్ సెంచరీ సాధించాడు. మరోవైపు అప్పటివరకు నిలకడగా ఆడిన రవీంద్ర జడేజా సైతం చూడచక్కని షాట్లతో తన కెరీర్‌లో 12వ అర్ధ సెంచరీ సాధించాడు. అప్పటికే జట్టు స్కోరు 500 పరుగులు దాటగా, వీరిద్దరూ మరింత వేగంగా ఆడారు. అయతే సెంచరీకి చేరువైన జడేజా (91) సినారన్ ముత్తుస్వామి బౌలింగ్‌లో డీబ్రైన్‌కు క్యాచ్ వెనుదిరిగాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్‌కు 225 పరుగులను జోడించారు. దీంతో కోహ్లీ (254, నాటౌట్) 601 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబదకు 3 వికెట్లు దక్కగా, కేశవ్ మహారాజ్, సినారన్ ముత్తుస్వామికి చెరో వికెట్ పడింది.
ఆదిలోనే షాక్..
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద ఓపెనర్ అయడెన్ మార్కరమ్ (0) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ (6) కూడా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో క్రీజులో ఉన్న థీనస్ డీబ్రైన్ (20, నాటౌట్), టెంబ బవుమా తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అయతే బవుమా(8)ని కొద్దిసేపటికే షమీ పెవిలియన్‌కు పంపాడంతో దక్షిణాఫ్రికా 33 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణా ఫ్రికా జట్టు 36 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయంది. క్రీజులో థీనస్ డీబ్రైన్ (20, నాటౌట్), అన్రిచ్ నోర్జె (2, నాటౌట్) ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా, మహ్మద్ షమీకి 1 వికె ట్ లభించింది.
స్కోర్ బోర్డు..
భారత్ మొదటి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సీ) డుప్లెసిస్ (బీ) రబద 108, రోహిత్ శర్మ (సీ) డికాక్ (బీ) రబద 14, చటేశ్వర్ పుజారా (సీ) డుప్లెసిస్ (బీ) రబద 58, విరాట్ కోహ్లీ (నాటౌట్) 254, అజింక్యా రహానే (సీ) డికాక్ (బీ) మహారాజ్ 59, రవీంద్ర జడేజా (సీ) థీనస్ డీబ్రైన్ (బీ) సినారన్ ముత్తుస్వామి 91.
ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం: 601 డిక్లేర్ (156.3 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-25, 2-163, 3-198, 4-376, 5-601.
బౌలింగ్: వెర్నర్ ఫిలాండర్ 26-6-66-0, కగిసో రబద 30-3-93-3, అన్రిచ్ నోర్జె 25-5-100-0, కేశవ్ మహారాజ్ 50-10-196-1, సినారన్ ముత్తుస్వామి 19.3-1-97-1, డీన్ ఎల్గర్ 4-0-26-0, అయడెన్ మార్కరమ్ 2-0-17-0.
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ (బీ) ఉమేశ్ 6, అయడెన్ మార్కరమ్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) ఉమేశ్ 0, థీనస్ డీబ్రైన్ (బ్యాటింగ్) 20, టెంబ బవుమా (సీ) సాహా (బీ) షమీ 8, అన్రిచ్ నార్జె (బ్యాటింగ్) 2.
ఎక్స్‌ట్రాలు: 0, మొత్తం: 36 (15 ఓవర్లలో 3 వికెట్లకు)
బౌలింగ్: ఇషాంత్ శర్మ 4-0-17-0, ఉమేశ్‌యాదవ్ 4-1-16-2, రవీంద్ర జడేజా 4-4-0-0, మహ్మద్ షమీ 3-1-3-1.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD