కోహ్లీ 3సెకన్లలో ఓకే చెప్పాడు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-03 03:46:00

డే/నైట్ టెస్టులపై గంగూలీ
img
కోల్‌కతా : బంగ్లాదేశ్‌తో డే అండ్ నైట్ టెస్టు నిర్వహించే యోచనలో ఉన్నామని చెప్పగానే .. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 3సెకన్లలోనే సరేనన్నాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఐదుసార్లు అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న సైమన్ టఫుల్ రాసిన ఫైండింగ్ ది గ్యాప్స్ పుస్తకావిష్కరణ శనివారం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గంగూలీ మాట్లాడాడు. గతంలో డే అండ్ నైట్ టెస్టులను బీసీసీఐ ఎందుకు వ్యతిరేకించిందో తెలియదని చెప్పాడు. డే అండ్ నైట్ టెస్టు(ఆడిలైడ్‌లో) ఆడేందుకు వారు ఎందుకు అంగీకరించలేదో కారణాలు నాకు తెలీదు. విరాట్‌తో గంటపాటు చర్చించా. డే అండ్ నైట్ టెస్టు నిర్వహించాలన్న ఆలోచనను ప్రారంభంలోనే చెప్పా. సరేనని 3సెకన్లలోనే విరాట్ సమాధానమిచ్చాడు. ప్రతి టీ20 మ్యాచ్‌కు స్టాండ్స్ అన్ని నిండిపోతాయని నాకు తెలుసు. కానీ సరైన నిర్వహణ ఉంటే టెస్టు మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అధిక సంఖ్యలో రప్పించవచ్చు. డే అండ్ నైట్ టెస్టుల వల్ల సంప్రదాయ క్రికెట్‌కు పూర్వవైభం వస్తుందని అనుకుంటున్నా అని గంగూలీ చెప్పాడు. డే అండ్ నైట్ టెస్టు ఆడేందుకు భారత్ తొలి నుంచి విముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD