కోహ్లీ.. మా దేశంలో ఆడు: పాక్ అభిమాని

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-10 14:45:26

img

స్టార్ బ్యాట్స్ మెన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కేవలం భారతీయులే కాకుండా ఇతర దేశస్తులు కూడా కోహ్లీ బాటింగ్ ను ఇష్టపడతారు. పాక్ లో కూడా కోహ్లీకి వీరాభిమానులు వున్నారు. అయితే కోహ్లీ అట తీరును ప్రత్యక్షంగా వీక్షించే అవాకాశం మాత్రం వారికి లభించడం లేదు. పాక్ లో భారత్ ఆడకపోవడమే దానికి కారణం.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు చెందిన ఒక అభిమాని.. కోహ్లీ తమ దేశంలో ఆడాలని కోరుకుంటున్నాడు. పాక్ కు చెందిన షాబాజ్ షరీఫ్.. కోహ్లీకి వీరాభిమాని. కోహ్లీ పాక్ లో ఆడితే చూడాలనేది అతని కోరిక. లాహోర్ లో పాక్-శ్రీ లంక మధ్య బుధవారం జరిగిన మూడో టీ -20 సందర్భంగా `కోహ్లీ.. మీరు పాకిస్తాన్ లో ఆడితే చూడాలని వుంది` అని రాసి వున్న ఫ్లకార్డు పట్టుకుని స్టేడియంలో తిరిగాడు. ఫోటో తీయించుకుని ట్విట్టర్ లో కూడా షేర్ చేశాడు. `కోహ్లీ.. నేను మీకు పెద్ద అభిమానిని. మీరు పాకిస్తాన్ కు వచ్చి మ్యాచ్ ఆడతారని భావిస్తున్నా` అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD