క్రికెటర్ల కాంట్రాక్టులపై సమీక్ష!
ముంబై: టెస్టుల్లో మాత్రమే ఆడుతున్న ఆటగాళ్లకు ఇప్పుడున్న దానికంటే మెరుగైన పారితోషికం చెల్లించాలని ఇటీవల విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ శాంతా రంగస్వామి సమర్థించారు. బీసీసీఐ పురుష క్రికెటర్లను ఏ-ప్లస్, ఏ, బీ, సీ గ్రేడ్లుగా వర్గీకరించింది. ప్రస్తుతం ఏ-ప్ల్సలో ఉన్నవారు ఏడాదికి రూ.7 కోట్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్, బుమ్రా మాత్రమే ఈ గ్రేడ్లో ఉన్నారు. రహానె, పుజారా వంటి టెస్టు ఆటగాళ్లు ‘ఏ’ గ్రేడ్లో ఉండడంతో వారికి ఏడాదికి రూ.5 కోట్లు మాత్రమే బీసీసీఐ చెల్లిస్తోంది. దీనిపై శాంతా రంగస్వామి స్పందిస్తూ ఒక ఫార్మాట్లోనే ఆడుతున్న క్రికెటర్లు, మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులను నూతనంగా ఏర్పడిన బీసీసీఐ కార్యవర్గం సమీక్షించాలని కోరింది.