క్రికెటర్ గౌతమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు…
స్పోర్ట్స్ న్యూస్: నిదానంగా బ్యాటింగ్ చేసేందుకు బుకీల నుంచి రూ. 20 లక్షలు అందుకుని స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై దేశవాళీ క్రికెటర్ చిదంబరం మురళీధరన్ గౌతమ్ ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతున్న వేళ, సహచర క్రికెటర్ అబ్రార్ కాజీతో కలిసి బళ్లారి టస్కర్స్ కు ప్రాతినిథ్యం వహించిన గౌతమ్, అతనితో కలిసి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు. బుకీల నుంచి డబ్బులు తీసుకుని హుబ్లీతో జరిగిన మ్యాచ్ లో అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై సాక్ష్యాలు సేకరించిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు, తొలుత కాజీని, ఆపై గౌతమ్ లను అరెస్ట్ చేశారు. ఈ జోడీకి డబ్బులిచ్చిన బుకీలను గుర్తించేందుకు వారిని విచారిస్తున్నారు.