క్రికెటర్ తో డేటింగ్.. నిధి అగర్వాల్ ఏమంటుందంటే..?

Asianet News

Asianet News

Author 2019-10-19 12:44:18

img

సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ కి ఉన్న బంధం ఏంటో తెలియదు కానీ.. మన తారలకు క్రికెటర్లతో ఎఫైర్లు ఉన్నాయంటూ చాలా వార్తలు వస్తుంటాయి. గతంలో చాలా మంది హీరోయిన్లు క్రికెటర్లను డేటింగ్ చేశారు. అయితేఆ బంధాలు ఎక్కువ రోజులు నిలవలేదు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మాత్రం విరాట్ కొహ్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మిగిలిన రిలేషన్స్ ఏవీ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు.

కానీ తరచూ క్రికెటర్లకు, హీరోయిన్లకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, బుమ్రా మధ్య ఎఫైర్ సాగుతుందంటూ వార్తలు వచ్చాయి. అలానే నిధి అగర్వాల్ చాలా కాలంగా ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి బయటకి వెళ్లడం, డిన్నర్ డేట్ లకు తిరగడంతో ఇద్దరి మధ్యా ఏదో ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించింది.

img

గతంలో ఈ జంట చాలా సార్లు తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయాన్ని నొక్కి చెప్పింది నిధి అగర్వాల్. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ రియాలిటీ షోలో నిధి అగర్వాల్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేఎల్ రాహుల్ తో డేటింగ్ లో ఉందంటూ వస్తోన్న రూమర్స్ పై నిధి స్పందించింది.

తను లండన్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ పై ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలించిందని.. ఆ సమయంలో తను భారత క్రికెట్ బృందాన్ని అభినందించానని చెప్పింది. ఆ సమయంలోనే నిధి.. రాహుల్ ని కలిసిందట. రాహుల్ తనకు చాలా కాలంగా తెలుసునని, ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పింది. వీరిద్దరి గురించి వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని నిధి అగర్వాల్ వివరించింది.

'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా తరువాత 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలలో నటించింది. గ్లామర్ షోలో ఎలాంటి మొహమాటాలు లేకుండా నటించే ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది.

img

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN