క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్‌ బ్రేక్‌

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-01 03:24:00

img
మెల్‌బోర్న్‌: విధ్వంసానికి మారుపేరైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అతడు.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం తీసుకుంటున్నట్లు గురువారం ప్రకటించాడు. మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా ్గలేనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మ్యాక్స్‌వెల్‌ కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. అందువల్లే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు’ అని జట్టు సైకాలజిస్ట్‌ మైకెల్‌ లాడ్‌ తెలిపాడు. మ్యాక్స్‌వెల్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని.. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా మేనేజర్‌ ఒలివర్‌ తెలిపారు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ (28 బంతుల్లో 62 నాటౌట్‌) మోత మోగించిన విషయం తెలిసిందే. 31 ఏండ్ల మ్యాక్స్‌వెల్‌ ఆసీస్‌ తరఫున 7 టెస్టులు, 110 వన్డేలు, 61 టీ20లు ఆడాడు. క్రికెట్‌కు బ్రేక్‌ ప్రకటించడంతో మూడో మ్యాచ్‌కు మ్యాక్సీ స్థానంలో డీఆర్సీ షార్ట్‌ను జట్టులోకి తీసుకోనున్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD