క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నాయర్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-24 14:03:00

ముంబై: వెటరన్‌ ముంబయి ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ నాయర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో అండగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపాడు. 'క్రికెట్‌కు వీడ్కోలు పలకడం గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్‌లో తిరిగి పునరాగమనం చేయను. దేనిపైనా పశ్చాతాపం లేదు' అని ట్వీట్‌ చేశాడు. ధోనీ సారథ్యంలో అతడు భారత్ తరఫున మూడు వన్డేలు ఆడాడు. 36 ఏళ్ల అభిషేక్‌ 103 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 45.62 సగటుతో 5,749 పరుగులు చేశాడు. దీనిలో 13 శతకాలు, 32 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా 31.47 సగటుతో 173 వికెట్లు పడగొట్టాడు. 99 లిస్ట్‌-ఎ మ్యాచులు ఆడిన అతడు 2,145 పరుగులు, 79 వికెట్లు తీశాడు.
అభిషేక్‌ ట్వీట్‌పై టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె స్పందించాడు. అతడితో కలిసి ఉన్న ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసాడు. ‘ క్రికెట్‌ వీడ్కోలు పలికిన ముంబై భాగస్వామికి అభినందనలు. నీతో కలిసి ఆడినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని రహానె ట్వీట్‌చేశాడు. న్యూజిలాండ్‌ మాజీ సారథి మెక్‌కలమ్‌ కూడా అభిషేక్‌ నాయర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మెక్‌కలమ్‌ ప్రధాన కోచ్‌, అభిషేక్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN