క్రికెట్‌ దేశాలకు టీమిండియా ఆదర్శం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-29 06:36:41

న్యూఢిల్లీ: క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలు అందుకొనేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ చాపెల్‌ కొనియాడాడు. క్రికెట్‌లో తమదైన ముద్ర వేయాలని తపించే దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. తద్వారా టెస్ట్‌ క్రికెట్‌ మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి టెస్ట్‌ సిరీ్‌సలో సౌతాఫ్రికాను 3-0తో వైట్‌వాష్‌ చేసిన టీమిండియాను చూసి మిగతా క్రికెట్‌ దేశాలు అసూయ చెందుతుంటాయన్నాడు. ‘భవిష్యత్‌లో టెస్ట్‌ క్రికెట్‌ బతికి బట్టకట్టాలంటే ఆటలో ప్రమాణాలు పెరగాలి. భారత్‌లో క్రికెట్‌ ప్రమాణాలు అమోఘంగా ఉన్నాయంటే అందుకు..ప్రతిభావంతులకు కొదవలేకపోవడం, అపార ఆర్థిక వనరులతోపాటు ఐపీఎల్‌ కారణం. అంతేకాదు అత్యున్నత శిఖరాలు చేరేందుకు భారత్‌ అనుసరిస్తున్న విధానాలను క్రికెట్‌లో బలమైన జట్టుగా మారాలని భావించే దేశాలు అనుసరించాలి’ అని చాపెల్‌ ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌కు రాసిన కాలమ్‌లో సూచించాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD