క్రికెట్ గ్రేట్ బ్రాడ్మన్ సరసన రోహిత్ శర్మ

Teluguglobal

Teluguglobal

Author 2019-10-03 16:12:37

img

  • స్వదేశీ గడ్డపై రోహిత్ టెస్ట్ సగటు 98.22
  • 15 ఇన్నింగ్స్ లో 884 పరుగుల రోహిత్

క్రికెట్ దిగ్గజం సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ సరసన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ చోటు సంపాదించాడు. స్వదేశీగడ్డపై జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో బ్రాడ్మన్ సగటు 98.22రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.

imgఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన తొలిటెస్టు తొలిరోజు ఆటలో రోహిత్ ఆజేయ సెంచరీ చేయడం ద్వారా.. ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

img

సొంతగడ్డపై ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో ..మొత్తం 15 ఇన్నింగ్స్ లో నాలుగో సెంచరీతో సహా 884 పరుగులు సాధించడం ద్వారా రోహిత్ తన సగటును 98.22కు పెంచుకోగలిగాడు.

img

క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ సైతం స్వదేశంలో ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో 98.22 సగటు సాధించడం విశేషం.

ఓపెనర్ గా తొలిటెస్టులోనే శతకం…

img

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ఓపెనర్ గా తొలిమ్యాచ్ లోనే శతకం బాదిన భారత నాలుగో క్రికెటర్ గా రోహిత్ మరో రికార్డు సాధించాడు. ఇంతకుముందే.. శిఖర్ ధావన్, రాహుల్, పృథ్వీ షా సైతం తమతమ టెస్ట్ అరంగేట్రం మ్యాచ్ ల్లోనే సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లుగా నిలిచారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN