క్రికెట్ లో మారిన సూపర్ ఓవర్ నిబంధనలు

Ap7am

Ap7am

Author 2019-10-15 11:20:00

img

  • సూపర్ ఓవర్ నిబంధనలపై విమర్శలు
  • బౌండరీల లెక్కతో విజేతలను తేల్చడంపై పలువురి ఆగ్రహం
  • విజేత తేలేవరకూ సూపర్ ఓవర్ వేయించాలని ఐసీసీ నిర్ణయం
ఈ సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గుర్తుందా? న్యూజిలాండ్, ఇంగ్లండ్ ల మధ్య స్కోర్ సమం కావడం, సూపర్ ఓవర్ తరువాత కూడా స్కోర్లు ఒకేలా ఉండటంతో, గెలిచిందెవరో తేల్చేందుకు బౌండరీలను లెక్కించారు. ఆపై ఇంగ్లండ్ అధిక బౌండరీలు సాధించి ఉండటంతో ఆ జట్టు గెలిచింది. ఈ విధానంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో నిబంధనలను మార్చేందుకు నిర్ణయించిన ఐసీసీ, తాజాగా, సూపర్ ఓవర్ నిబంధనలు మార్చేసింది. సూపర్ ఓవర్ కూడా టై అవుతుంటే, ఫలితం వచ్చేంత వరకూ సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని స్పష్టం చేసింది. నాకౌట్ దశలో మాత్రమే ఆడిస్తున్న సూపర్ ఓవర్లు ఇకపై లీగ్ దశలోనూ ఉంటాయని, ఒకసారి సూపర్ ఓవర్ టై అయితే, మ్యాచ్ టై అయినట్టేనని ఐసీసీ పేర్కొంది. జింబాబ్వే, నేపాల్ జట్లపై గతంలో విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్టు వెల్లడించింది.

ఇక మహిళల క్రికెట్ పోటీలకు ఇస్తున్న బహుమతి మొత్తాన్ని భారీగా పెంచుతూ కూడా ఐసీసీ బేరర్లు నిర్ణయం తీసుకున్నారు. టీ-20 వరల్డ్ కప్ పోటీల్లో విజేతకు రూ. 7 కోట్లు, రన్నరప్ కు రూ. 3.5 కోట్లు ఇవ్వనున్నారు. వన్డే ప్రపంచ కప్‌ మొత్తం ప్రైజ్‌ మనీని రూ. 24.8 కోట్లకు పెంచాలని కూడా ఐసీసీ నిర్ణయించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN