క్రీడలతో మానసిక ఉల్లాసం

Prajasakti

Prajasakti

Author 2019-10-07 01:19:23

2టౌన్‌ సిఐ రమేష్‌
క్రీడల ద్వారా మానసిక, శారీరక ఉల్లాసాన్ని పొందవచ్చని టూ టౌన్‌ సిఐ రమేష్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఎన్‌.టి.ఆర్‌ స్టేడియం ఆధ్వర్యంలో ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన కష్ణాజిల్లా ఓపెన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి సాధన చేస్తే క్రీడల ద్వారా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. అనంతరం వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వజీర్‌ను స్టేడియం కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పిన్నమనేని సాంబశివరావు, స్టేడియం కమిటీ సభ్యులు లంకదాసరి ప్రసాదరావు, ఐఎంఎ జాతీయ ఉపాధ్యాక్షుడు డా|| పొట్లూరి గంగాధరరావు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD